యూపీలోని కాన్పూర్ బర్రా ప్రాంతంలోని ఓ యువతి ఘాతుకానికి పాల్పడింది. స్థానికంగా నివసించే మున్నా లాల్ ఉత్తమ్ (62), రాజ్ దేవి (55) దంపతులు. వారికి కుమారుడు అనూప్, కుమార్తె కోమల్ ఉన్నారు. కోమల్ ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. ప్రియుడి ప్రోద్బలంతో తల్లిదండ్రులకు జ్యూస్లో మత్తుమందిచ్చి, గొంతు కోసి చంపింది. నిందితురాలిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.