చాలా మంది పంటినొప్పికి యాంటీబయోటిక్స్ వాడుతుంటారు. అయితే అది చాలా ప్రమాదకరమైనది. కొన్ని చిట్కాలను పాటిస్తే పంటి నొప్పిని నివారించొచ్చు. కొబ్బరి నూనెలో కొంత లవంగం పొడిని కలిపి బ్రష్ సాయంతో పంటి నొప్పి ఉన్న చోట ఈ మిశ్రమాన్ని పూయాలి. రోజుకు మూడు సార్లు ఇలా చేస్తే పంటి నొప్పి తగ్గిపోతుంది. అల్లం ముక్కను కత్తిరించి, పంటి నొప్పి ఉన్నచోట తేలికగా నమిలితే కొంత సేపటి తర్వాత నొప్పి తగ్గిపోతుంది.