విజిబుల్ పోలీసింగులో భాగంగా జూలై 5న విజయనగరం జిల్లా, చీపురుపల్లి సిఐ శ్రీ జి.సంజీవరావు , జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం.దీపిక ఐపీఎస్ గారి ఆదేశాలతో చీపురుపల్లి పట్టణంలో యువతకు రహదారి భద్రతా నియమాలు, దిశా యాప్ మరియు సైబరు నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ మాట్లాడుతూ... ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ , ప్రమాదాల్ని అరికట్టే దిశగా నడుచుకోవాలి దీని వలన ప్రమాదాల్ని అరికట్టడమే కాకుండా మీ ప్రాణాలకు కూడా భద్రత లభిస్తుంది అని తెలియజేసారు. అలానే సోషల్ మీడియా వాడే వారు కేసం అవసరాల కోసమే వాటిని వాడాలి, అలానే ఉపయోగకరంగానే వాడుకోవాలి తప్ప, తప్పు చేసే దిశగా చెడు ఉద్దేశాలలతో ఉండకూడదు, దాని వలన కఠిన శిక్షలకి గురవుతారు అని హెచ్చరించారు.