చాలా మంది మానసిక, శారీరక అనారోగ్యాల బారిన పడుతుంటారు. అలాంటివారు రోజూ కాసేపు సమయం కేటాయించి యోగా ప్రాక్టీస్ చేస్తే అనేక జబ్బులు రాకుండా చూడొచ్చు. రోజూ యోగా చేసే వారిలో ఒత్తిడి స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. యోగా చేయడం వల్ల ఎక్కువ మనశ్శాంతి, తక్కువ డిప్రెషన్, ఆందోళన ఉన్నట్లు తేలింది. అంతేకాదు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి యోగా చేయడం ఎంతో మంచిది.