జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బుధవారం ఆసక్తికర పరిణామం జరిగింది. భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు లొంగిపోయారు. అనంతరం వారి నుంచి ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు స్థానిక యువకులు ఇటీవలే ఉగ్రవాద సంస్థల్లో చేరినట్లు పోలీసులు తెలిపారు.