రాజస్థాన్‌లో సంచలనం రేపిన టైలర్ కన్నయ్యలాల్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని మంగళవారం హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నారు. బీహార్‌కు చెందిన ఈ అనుమానితుడు సంతోష్‌నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కన్నయ్యలాల్‌ను హత్య చేసిన నిందితులకు ఈ వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని ఆధారాలు లభించాయి. హత్యలో ఇతని పాత్ర ఏమైనా ఉన్నదా? అనే కోణంలో ఎన్ఐఏ విచారిస్తున్నది.