తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలు కు నిరసనగా తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్ డిపో దగ్గర నిరసన తెలియ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రజలని ధరల పెంపుతో ఈ ప్రభుత్వం ఎంతగానో ఇబ్బంది పెడుతుందని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలు రెండు సార్లు పెంచారు, సామాన్యప్రజానీకానికి ఎంతగానో నష్టం వాటిల్లే విధంగా ప్రభుత్వం నడుచుకోవడం హేయమైన చర్య అని వాపోయారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికలలో ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.