యూకే ప్రధాని బోరిస్ జాన్సన్కు పదవీ గండం ముప్పు పొంచి ఉంది. ప్రధాని నాయకత్వంపై విశ్వాసం లేదని పేర్కొంటూ భారత సంతతికి చెందిన యూకే ఆర్థిక మంత్రి రిషి సునక్ మంగళవారం రాజీనామా చేశారు. కాసేపటికే మరో మంత్రి సాజిద్ జావిద్ కూడా పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఆశించినట్లు ప్రభుత్వం సక్రమంగా, సమర్థవంతంగా నడవడం లేదని వారు పేర్కొన్నారు.