ఒడిషా, భద్రక్లోని బెంటాల్పూర్ గ్రామంలో ఓ రైతుకు గోల్డెన్ టర్టైల్ దొరికింది. ఈ అరుదైన తాబేలు బంగారు రంగులో దగదగా మెరుస్తుంది. ఈ తాబేలు బరువు రెండున్నర కిలోలుగా ఉంది. ఇది అపురూపమైన తాబేలు అని అటవీ శాఖ అధికారులు తెలిపారు. తేటగా ఉన్ననీటిలో ఈ తాబేలు జీవిస్తుందనీ, అందుకని ఈ తాబేలును పరిశుభ్రంగా ఉన్న నీటిలోకి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ తాబేలును చూడటానికి రైతు ఇంటికి జనాలు క్యూ కట్టారు.