కాంగ్రెస్-ఎన్‌సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఎదురు తిరుగుబావుటా ఎగురవేసినట్లు మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే తెలిపారు. బుధవారం థానెలో మీడియాతో మాట్లాడారు. భావజాలానికి విరుద్ధంగా పని చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. నిధులు లేక పనులు చేయలేకపోయామన్నారు. ఈ విషయాన్ని ఉద్ధవ్ థాకరేకు వివరించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.