ఇటీవల జపాన్‌లోని దాదాపు 10 వేళ్ల ఇళ్లు అంధకారంలో మునిగిపోయాయి. ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లోని కొరియామా సిటీలో జూన్ 29న ఈ పరిస్థితి ఎదురైంది. విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కీలక పరికరాలలోకి దూరిన పాము చనిపోయింది. అలారం మోగడంతో కాసేపటికే అగ్నిమాపక వాహనాలు అక్కడకు వచ్చేశాయి. లోపలికి వెళ్లి చూడగా పాము అవశేషాలు కనిపించాయి. గంటకు పైగా సిబ్బంది శ్రమించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa