కొమరోలు: పట్టణ సమీపంలో బుధవారం సాయంత్రం రెండు పెనపాములు చాలాసేపు నృత్యం చేశాయి. ఈ సంఘటనను స్థానికులు చాలా ఆసక్తిగా తిలకించారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో పెనపాములు పలుమార్లు దర్శనమిచ్చాయని స్థానికులు చెప్పారు.
పెనపాముల సుమారు గంటకు పైగా నృత్యం చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయాయి. స్థానికులు మాత్రం వాటి నృత్యాన్ని చూసి ఆస్వాదించారు. కానీ వాటికి హాని తలపెట్టలేదు.