ఏపీలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలను పెంచుతూ ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్సీటీఈ, బీసీఐ అర్హత ఉన్న అధ్యాపకులకు రూ.35 వేలు, పీహెచ్డీ అర్హత ఉన్న వారికి మరో రూ.5వేలు అదనంగా చెల్లించనున్నారు. యూనివర్సిటీల్లోని బోధనేతర సిబ్బందికి 11వ పీఆర్సీ అమలు చేయాలని మరో జీవో జారీ చేశారు. 2015 పీఆర్సీ పొందుతున్న వారికి ఇది వర్తించనుంది.