ఏపీలోని చిత్తూరు జిల్లాలో తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్న గుర్రప్ప(22), పల్లవి (18) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అడవికొడియంబేడు సమీపంలో జరిగింది. సోమవారం గుర్రప్ప, పల్లవి ఇంటి నుంచి వెళ్లిపోయారు. బుధవారం అరుణానది ఇసుక రీచ్‌కు వెళ్లే దారిలో ఉరేసుకొని మృతి చెంది కనిపించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa