గుంటూరు వెస్ట్: నాగార్జున యూనివర్సిటీ వద్ద జూలై 8, 9వ తేదీలలో జరగనున్న వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఉదయం వారి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కోరారు.