భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,930 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది. గత 24 గంటల్లో 14,650 మంది కరోనా నుంచి కోలుకోగా, 35 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 1,19,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 5,25,305 మంది కరోనాతో మృతిచెందారు.