బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ పరిస్థితి ఇంకా అత్యంత విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఇంట్లో మెట్లపై నుంచి జారి పడిన లాలూకు కుడి భుజం బాగా దెబ్బతింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అత్యుత్తమ వైద్యం అందిస్తున్నప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడట్లేదని లాలూ తనయుడు తేజస్వి పేర్కొన్నారు.