భారత్ లో బీఏ 2.75 అనే ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వెలుగుచూసినట్లు డబ్ల్యూహెచ్ఓ బుధవారం వెల్లడించింది. తొలుత భారత్ లోనే ఈ వేరియంట్ బయటపడిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇప్పటివరకు 10 దేశాల్లో ఈ సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డట్లు తెలిపింది. దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అయితే ఏ రాష్ట్రంలో ఈ వేరియంట్ బయటపడిందో డబ్ల్యూహెచ్ఓ వెల్లడించలేదు.