ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలేషియా మాస్టర్స్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన పీవీ సింధు!

sports |  Suryaa Desk  | Published : Thu, Jul 07, 2022, 01:23 PM

రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు మరోసారి తన సత్తా చాటింది. వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మలేషియా మాస్టర్స్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. కౌలాలంపూర్ వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-12, 21-10తో జాంగ్ యి (చైనా)పై గెలిచింది. ఈ మ్యాచ్ 28 నిమిషాల్లో ముగిసింది. అంతకుముందు బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో చైనాకు చెందిన హీ బింగ్ జియావోపై సింధు విజయం సాధించింది. 21-13,17-21,21-15 తేడాతో విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో గెలిచి రెండో రౌండ్‌కు చేరిన భారత షట్లర్ సాయి ప్రణీత్‌కు నిరాశే ఎదురైంది. అతను చైనాకు చెందిన లీ షి ఫెంగ్ చేతిలో 14-21, 17-21 తేడాతో ఓడిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com