పొన్నూరు: గుంటూరు జిల్లాలో ఈ నెల 8, 9వ తేదీల్లో జరుగనున్న వైసీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గురువారం పిలుపునిచ్చారు. స్థానిక పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లీనరీలో పలు అంశాల తీర్మానాలు, భవిష్యత్ కార్యాచరణ గురించి తెలియజేస్తారని చెప్పారు.