గుంటూరు: నగరపాలక సంస్థ పరిధిలో ఈనెల 10వ తేదీన బక్రీదు పండుగను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, అందుకు నగరపాలక సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని గురువారం కమిషనర్ చేకూరికి కీర్తి తెలిపారు. అనధికార జంతు వధ, గోవధ నిషేధమని కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎక్కడైనా గోవధ జరిగిందని గుర్తిస్తే నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక డెస్క్ 08632345104 కి సమాచారం ఇవ్వాలని కోరారు.