ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఆఖరి అవకాశామా? అతడిని డ్రాప్ చేయాలని సెలక్టర్లు యోచిస్తున్నారా? అవుననే సమాధానం వస్తుంది. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగి 9 నెలలు కావస్తున్నా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విరాట్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పేలవ బ్యాటింగ్‌తో ఇబ్బంది పడుతున్న అతడు జట్టుకు భారంగా మారాడు. మరికొద్ది రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో.. టీమ్ కాంబినేషన్ పై టీమ్ మేనేజ్ మెంట్ దృష్టి సారించింది. అయితే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడం విరాట్ కోహ్లీకి కష్టంగా మారింది. ఇంగ్లండ్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో కోహ్లీ ఆటతీరుపైనే అతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది.