సీఎం జగన్ పులివెందుల పర్యటన ఆధారంగా , టీడీపీ నేతలని హౌస్ అరెస్ట్ చేసారు అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు. సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన రైతు సమస్యలను వివరించేందుకు కూడా అనుమతి లేదా? అని టీడీపీ నాయకులూ బీటెక్ రవి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో అవినాష్ రెడ్డిని స్టేజి మీదకు పిలిచి మైక్ ఇచ్చి మాట్లాడించిన చరిత్ర టిడిపిది. గత మూడేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించేందుకు, నాకు అవకాశం ఇవ్వాలని కోరిన పోలీసులు అడ్డుకున్నారు అని ఆవేదన వ్యక్త పరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa