సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో అరుదైన కారుణ్య నియామకం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ రైల్వే డివిజన్లో రాధిక అనే 10 నెలల చిన్నారికి కారుణ్య నియామకం కింద.. బుధవారం రైల్వే అధికారులు ఉద్యోగం కోసం రిజిస్ట్రేషన్ చేశారు. కాగా, చిన్నారికి 18 ఏళ్లు నిండిన తర్వాతే ఉద్యోగం ఇవ్వనున్నారు. భిల్లాయ్లోని పీపీ అసిస్టెంట్‌గా పనిచేసే రాధిక తండ్రి రాజేంద్రకుమార్ యాదవ్.. జూన్ 1న రోడ్డుప్రమాదంలో మరణించాడు.