పల్నాడు: పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో సిపిఎం, ఐద్వా ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి వినూత్నమైన రీతిలో గురువారం నిరసన తెలిపారు.
ఈ నిరసనలో పల్నాడు జిల్లా సిపిఎం కార్యదర్శి గుంటూరు విజయకుమార్, పెదకూరపాడు మండల సిపిఎం పార్టీ ఇన్చార్జి గుంటూరు మల్లేశ్వరి, మహిళా సంఘం జిల్లా నాయకురాలు గద్దె ఉమ శ్రీ, ఐద్వా నాయకురాలు రమాదేవి, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు.