నందికొట్కూరు: రాష్ట్ర ప్రభుత్వం 117 జీవో ద్వారా మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూల్లో విలీనం చేస్తూ ప్రాథమిక పాఠశాలను మూసివేయడం తగదని పిడిఎస్ యు నాయకుడు నవీన్ విమర్శించారు. మిడుతూరు మండలంలోని అలగనూరు గ్రామంలో గురువారం పాఠశాల విలీనంపై విద్యార్థుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదన విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.