ముస్లీం పవిత్ర బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కుల,మతాలు కన్నా మానవత్వం గొప్పదని ఆదోని డిఎస్పి వినోద్ కుమార్, తాహసీల్దార్ జయన్న , మున్సిపల్ కమిషనర్ కృష్ణ అన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం హిందూ , ముస్లీం, క్రైస్తవ వర్గాలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు ప్రాంతం శాంతి సహనానికి నిదర్శనం అన్నారు.