హొళగుంద: హొళగుంద మండలంలోని రైతాంగానికి వ్యవసాయ అధికారులు సకాలంలో ఎరువులు సబ్సిడీ విత్తనాలను అందించాలని తుంగభద్ర రైతు సంఘం గౌరవ అధ్యక్షులు రామిరెడ్డి గురువారం డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులు విత్తనాలు అందిస్తే పంటల దిగుబడికి ఎంతో అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఆయకట్టు రైతులకు సబ్సిడీ వరి విత్తనాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.