ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది బాబు గారీ రింగ్ కథ...ఎంతటి టెక్నాలజీయో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 03:21 AM

చంద్రబాబు అంటేనే టెక్నాలజీ అన్నట్లుగా ప్రచారముంది. అలాంటి టెక్నాలజీని అనుసరించే చంద్రబాబు చేతికి ఉన్న రింగు  పై పెద్ద చర్చనే కొనసాగింది. దీనిపై ఆయన స్పందించారు. ఏమిటీ  ఆ కథం అని ఆసక్తిగా ఉంది కదూ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో సింపుల్‌గా ఉంటారు. ఎప్పుడూ ఒకే రకమైన వస్త్రధారణతో కనిపించే ఆయన.. ఎలాంటి ఆభరణాలు కానీ.. ఉంగరాలు కానీ ధరించడానికి ఇష్టపడరు. కానీ మదనపల్లెలో నిర్వహించిన టీడీపీ మినీ మహానాడు లో ఆయన చేతి వేలికి ఓ ఉంగరం కనిపించిదంది. దశాబ్దాలుగా ప్రజల మధ్య ఉన్న ఆయన.. ఎప్పుడూ చేతికి ఉంగరాలతో కనిపించలేదు. కానీ అన్నమయ్య జిల్లా పర్యటనలో ఆయన ఎడమ చేతి చూపుడు వేలికి ఉంగరం పెట్టుకోవడంతో.. దాని గురించి తెలుసుకోవడం కోసం టీడీపీ కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజానీకం సైతం ఆసక్తి చూపారు.


దీంతో చంద్రబాబు నాయుడే స్వయంగా ఆ రింగ్ గురించి చెప్పారు. అది అసలు ఉంగరమే కాదన్న టీడీపీ అధినేత.. హెల్త్ మానిటర్ పరికరమని తెలిపారు. మైక్రో చిప్ సాయంతో ఇది పని చేస్తుందన్నారు. ఈ చిప్ తన ఆరోగ్య సమాచారాన్ని నిత్యం కంప్యూటర్‌కు పంపుతుందన్నారు. రోజులో ఎన్ని అడుగులు నడిచారు. ఆక్సీజన్ స్థాయిలు ఎలా ఉన్నాయి. గుండె కొట్టుకునే వేగం ఎలా ఉంది..? బీపీ ఎలా ఉంది.. రాత్రి ఏ సమయంలో నిద్రకు ఉపక్రమిస్తున్నారు.. ఎన్ని గంటలకు లేస్తున్నారనే విషయాలను ఈ చిప్ మానిటర్ చేస్తుంది. దీన్ని బట్టి వైద్యులు ఆరోగ్యం విషయమై తనకు సలహా ఇస్తారని చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యం విషయంలో తాను చేసే తప్పిదాలను సరి చేసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుందన్నారు.


తన ఆరోగ్యాన్ని మానిటర్ చేయడం కోసం ఈ రింగ్‌ను ధరించానని చెప్పిన చంద్రబాబు.. కార్యకర్తలు సైతం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాలనలో టెక్నాలజీ వాడకానికి ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబు నాయుడు.. తన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలోనూ ఆయన టెక్నాలజీని ఉపయోగిస్తుండటం గమనార్హం.


మితంగా ఆహారం తీసుకుంటూ.. ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ వహించే చంద్రబాబు నాయుడు.. ఫిట్‌నెస్ విషయంలో 70 ఏళ్ల వయసులోనూ యువకులతో పోటీ పడుతుంటారు. గంటల తరబడి ప్రయాణం చేసినా.. సుదీర్ఘ ప్రసంగాలు చేసినా ఎక్కడా అలసిపోయినట్లు కనిపించరు. రాజకీయాల విషయం పక్కనబెడితే ఆరోగ్యం, ఫిట్‌నెస్ విషయంలో చంద్రబాబును తెలుగు యువత ఆదర్శంగా తీసుకోవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa