తాడేపల్లి: పోలీసు స్టేషన్ కు అతి సమీపంలో పాడుపడ్డ రైల్వే క్వార్టర్స్ ను అడ్డాగా చేసుకుని కొందరు స్థానిక యువకులు బహిరంగంగా మద్యం, గంజాయి సేవిస్తున్నారు. ఆ మత్తులో ప్రయాణికులపై దాడులు చేసిన ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో తమ నివాసాల వద్ద గొడవలు ఏంటని ప్రశ్నించిన భార్య, భర్తలపై యువకులు రాళ్ళతో దాడికి దిగారు. ఘటనపై గురువారం తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa