తెనాలి: ముగ్గురు వ్యక్తులు బలవంతంగా ఫోన్ లాక్కెళ్ళిన ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నేలపాడు గ్రామంలో జగనన్న కాలనీ పర్యవేక్షణ నిమిత్తం వెళ్లిన శనివారపు రఘు తిరిగి తెనాలి వస్తు, తెనాలి సిరిపురం మార్గంలో రోడ్డుపై నిలుచుని ఫోను మాట్లాడుతుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైకుపై వచ్చి ఫోన్ లాక్కొని పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.