మేడికొండూరు: పేరేచర్లకు చెందిన విద్యార్థిని (16) గురువారం కళాశాలకు వెళ్లి అదృశ్యమైనట్టు విద్యార్థిని తల్లిదండ్రులు గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నల్లపాడు సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం విద్యార్థిని ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి కళాశాలకు వెళ్ళింది. సాయంత్రo అయినా ఇంటికి రాకపోవడంలో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి వాకబు చేయగా కళాశాలకు రాలేదని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa