బాపట్ల జిల్లాలో ప్రజలందరూ తప్పనిసరిగా కోవిడ్నిబంధనలు పాటించాలని బాపట్ల జిల్లా వైధ్యా ఆరోగ్య శాఖ అధికారిణి జే. యాస్మిన్ తెలిపారు. ఇప్పటివరకు బాపట్ల జిల్లాలో ఎటువంటి కోవిడ్మరణాలు సంభవించలేదన్నారు.
ప్రస్తుతం బాపట్ల జిల్లాలో 9 కోవిడ్ యాక్టివ్ కేసుల నమోదయ్యాయని తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి, మాస్క్ ధరించి, తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు.