కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదస్పద 'అగ్నిపథ్' పథకంపై ఈ నెల 11న కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ చర్చించనుంది. ఈ సమావేశంలో అగ్నిపథ్‌పై ప్రతిపక్ష ఎంపిల నుండి ప్రభుత్వం కఠినమైన ప్రశ్నలను ఎదుర్కొనుంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అగ్నిపథ్ పథకంలోని వివిధ అంశాలను పార్లమెంటరీ ప్యానల్‌కు వివరిస్తారు.