శ్రీశైల క్షేత్రంలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ నియంత్రణకు దేవస్థానం తరఫున కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం ఈవో లవన్న గురువారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వ్యాపార దుకాణాలు, హోటళ్లలో ప్లాస్టిక్ సంచుల స్థానంలో వస్త్ర, జూట్ బ్యాగులను వినియోగించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దేవస్థానం నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తామని తెలిపారు.