దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణ ఆందోళనలు,పెరుగుతున్న వడ్డీ రేట్ల వంటి ఇతర కారణాలు దేశీయ మార్కెట్లకు వరంగా మారాయి.
ఈ పరిణామాల మధ్య నేడు ఉ.10:06 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 54,432 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 16,202 వద్ద కొనసాగుతోంది.