జపాన్ మాజీ ప్రధాని షింజో అబే పై నారా ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు జపాన్ కు చెందిన ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది. జపాన్ నగరంలోని ఓ వీధిలో ప్రసంగిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై దాడి చేసినట్లు పేర్కొంది.దీంతో ఆయన ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు.ఈ సంఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు. ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే ఆయన మరణించినట్లు సమాచారం.
నిందితుడిని శుక్రవారం.. అంటే ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.అబే తొలిసారిగా 2006లో జపాన్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. అయితే కొన్ని వివాదాల కారణంగా ఒక సంవత్సరం పదవిలో ఉన్న తర్వాత పదవీ విరమణ చేశారు. ఆబే పై జరిగిన దాడిని ఖండించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.” నా ప్రియమిత్రుడు షింజో అబే పై జరిగిన దాడి తో తీవ్ర మనోవేదనకు గురయ్యా. తామంతా అతని కుటుంబంతో.. జపాన్ ప్రజలతో ఉన్నామంటూ” ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.