ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ పై పెట్రేగిపోతున్న సైబర్ దాడులు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 03:36 AM

భారత్ పై సైబర్ దాడులు పెట్రేగిపోతున్నాయి. దీంతో పోలీసు అధికార్లు రంగంలోకి దిగారు. మహ్మద్ ప్రవక్తపై మాజీ బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ వ్యాఖ్యలు అనంతరం భారత్‌పై పెద్దఎత్తున సైబర్ దాడి జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది సంఖ్యలో వెబ్‌సైట్‌లు హ్యాక్‌కు గురయ్యాయి. మలేషియా, ఇండోనేషియాకు చెందిన ముస్లిం హ్యాకర్లు భారత్‌పై సైబర్ దాడులకు పాల్పడ్డారని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీంతో హ్యాకర్లను పట్టుకునేందుకు సైబర్ క్రైం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు మలేషియా, ఇండోనేషియా ప్రభుత్వాలకు లేఖ రాశారు. 'డ్రాగన్ ఫోర్స్ మలేషియా', 'హాక్టివిస్ట్ ఇండోనేషియా' అనే హ్యాకర్ గ్రూపులు ఈ దాడులను నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ రెండు గ్రూపులు కూడా భారతదేశంపై సైబర్ దాడులు చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం హ్యాకర్లకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు మన దేశంలో రెండు వేల వెబ్‌సైట్‌లను హ్యాక్ చేసినట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు హ్యాకర్లు నుపుర్ శర్మ ఇంటి లొకేషన్‌తో పాటు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పెట్టారు.


దీంతో హ్యాకర్లను పట్టుకునేందుకు సైబర్ క్రైం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు మలేషియా, ఇండోనేషియా ప్రభుత్వాలకు లేఖ రాశారు. అలాగే రెండు హ్యాకర్ గ్రూపుల సభ్యులపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం కోసం ఇంటర్పోల్కు లెటర్ కూడా రాశారు. కాగా నుపుర్ శర్మ వ్యాఖ్యలు అనంతరం వరసగా ఎన్నో హ్యాకింగ్ ఘటనలు వెలుగు చూశాయి. ఓ ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో హ్యాకర్లు పాక్ జెండాను ప్రదర్శించారు. థానే పోలీసుల వెబ్‌సైట్‌, జార్ఖండ్ గవర్నర్ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయి.


ఇదిలావుంటే నుపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ హ్యాకర్లు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఆమె వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. రాజస్థాన్‌లో ఓ టైలర్ హత్య కూడా జరిగింది. దాంతో చాలా ప్రాంతాల్లో ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నుపుర్ శర్మ తనపై నమోదైన నేరాలు వివిధ నగరాల్లో ఉన్నాయని, వాటన్నింటినీ ఢిల్లీలో వర్గీకరించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టు దానిని తిరస్కరించింది. నుపుర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు నుపుర్ శర్మ మాటలపై అరబ్ దేశాలు కూడా మండిపడ్డాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com