కర్నాటకలోని కలబురిగి జిల్లాలో దయానంద లదంతి (24) ఇటీవల దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన అతడు ఇటీవలే తిరిగొచ్చాడు. అతడి ఫోన్కు మిస్డ్కాల్ ద్వారా పరిచయమైన మహిళ అంబికతో ప్రేమలో పడ్డాడు. అయితే అంబికతో అనిల్ అనే వ్యక్తి అతడిని ట్రాప్ చేయించాడు. తన భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడనే కోపంతో, అంబిక సాయంతో రప్పించి హత్య చేయించాడు. జూన్ 24న జరిగిన హత్యను తాజాగా పోలీసులు ఛేదించారు.