సోంపేట పట్టణ పరిధి పెద్దకోమటి వీధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం శుక్రవారం స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టణానికి చెందిన సానా మనోహర్ కిలో రూ. 14 కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో కిలో రూ. 20 చొప్పున అమ్ముతున్నట్టు గుర్తించామన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించామని తెలిపారు. మనోహర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు.