వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజు ప్లీనరీ సమావేశాల్లో దిశనిర్దేశం చేస్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. రెండో రోజు ప్లీనరీకి పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలివస్తున్నారని, అధ్యక్షుల ముగింపు ప్రసంగం ఉంటుందని చెప్పారు. వైయస్ఆర్సీపీ శ్రేణుల్లో మూడు రోజుల నుంచే ఉత్సాహం కనిపిస్తోంది. పెళ్లి, పండుగ జరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ రోజు సీఎం ముగింపు సందేశంలో దిశా నిర్దేశం చేస్తారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దిశా నిర్దేశం చేస్తారు. మా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఓ వర్గం మీడియా ఎలా విష ప్రచారం చేస్తుంది, ఆ ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలో చెబుతారు. వచ్చే ఎన్నికల్లో మా కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తారు. తీర్మానాలపై చర్చ ఉంటుంది. నిన్న రాలేని వారు ఉదయం నుంచి బయలుదేరారు. వచ్చే ఎన్నికలకు వెళ్లేందుకు ఈ ప్లీనరీలో సీఎం వైయస్ జగన్ ఉత్సాహం నింపుతారు. అని సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు.