అబార్షన్లపై మహిళా హక్కులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 22-24 వారాలలోపు అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకోడాన్ని చట్టబద్ధంగా పేర్కొంటూ.. అందుకు సంబంధించిన ఫైలుపై శుక్రవారం సంతకం చేశారు.అబార్షన్‌కు రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల ఈ హక్కును ఆ దేశ సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని ఆయన తప్పుబట్టారు.