వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్కు శనివారం రంగం సిద్ధమైంది. కజికిస్థాన్ ప్లేయర్ రిబకినాతో, ట్యూనిషియా ప్లేయర్ జాబెర్ టైటిల్ కోసం పోటీపడనున్నారు. వీళ్లిద్దరికి ఇదే తొలి వింబుల్డన్ ఫైనల్.
ఓ గ్రాండ్ స్లామ్లో ఫైనల్ చేరిన తొలి అరబ్ క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పిన జాబెర్.. టైటిల్ సాధించాలని భావిస్తోంది. రిబకినా గెలిస్తే కజికిస్థాన్ తరపున గ్రాండ్ స్లామ్ గెలిచిన తొలి మహిళగా నిలుస్తుంది.