ఏపీలోని విజయనగరం జిల్లా గరివిడి మండలం కుమరాంలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు శుక్రవారం రాత్రి గోడకూలి ఇద్దరు మృతి చెందారు. మృతులను అడ్డాల లక్ష్మి (45), ఆమె మనవడు అశోక్ కుమార్ రాజు (5)గా గుర్తించారు.
మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.