దేశవ్యాప్తంగా క్రమేపీ భారీగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,840 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 43 మంది కోవిడ్ బారిన పడి చనిపోయారు. తాజాగా 16104 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,25,028కు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.14 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.