రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. తాజాగా పాల ధరలు పెరిగాయి. హెరిటేజ్ పాల ధర శనివారం రూ.2లు పెరిగింది. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలు పెంచగా మిగతా సంస్థలూ ఇదే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రవాణా ఖర్చులు పెరగటంతోపాటు ఇతర వ్యయాలు అధికం కావటంతో ధరలు పెంచాల్సి వస్తోందని ఈ సంస్థలు ప్రతినిధులు తెలిపారు.