మధ్యప్రదేశ్లోని భోపాల్ సమీపంలోని పర్వాలియాలో బుధవారం దారుణం జరిగింది. స్థానికుడైన ప్రతాప్ బంజారాకు ఓ యువతి(20)తో ఆరేళ్ల క్రితం పెళ్లైంది. మూడేళ్ల క్రితమే ఆమె మెట్టినింటికి వచ్చింది. అయితే ఇన్నేళ్లైనా పిల్లలు పుట్టలేదని బాధితురాలి అత్త, మామ, బావ కర్కశంగా ప్రవర్తించారు. ఆమె ముఖంపై వేడి వేడి నూనె పోశారు. భర్త అడ్డుకోకుండా నిందితులకు సహకరించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.