ఏపీలోని విజయవాడకు చెందిన నర్సింహరాజు, శివరంజని దంపతులు తమిళనాడు తిరుచ్చిలో ఉంటున్నారు. ఇటీవల నర్సింహరాజు ఆన్లైన్ రమ్మీకి బానిసై, డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరికి ఇంటిని రూ.28 లక్షలకు అమ్మేశాడు.
దీనిని భార్య ప్రశ్నించడంతో ఆమెను జులై 4న దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి పరారయ్యాడు. మృతురాలి తండ్రి వారింటికి గురువారం రావడంతో ఈ ఘోరం వెలుగు చూసింది.