ఆమ్నెస్టీ ఇండియాతో పాటు ఆ సంస్థ మాజీ సీఈవో ఆకార్ పటేల్ భారత విదేశీమారకద్రవ్య చట్టం ఉల్లంఘించిన నేరానికి రూ.61.72 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు ఈడీ శుక్రవారం వెల్లడించింది. ఫెమా చట్టం కింద ఆమ్నెస్టీ ఇండియాకు రూ.51.72 కోట్లు, ఆకార్ పటేల్‌కు రూ.10 కోట్లు జరిమానా విధించినట్లు నోటీసులు జారీ చేసింది. లండన్ లో ఉన్న ఈ సంస్థ భారత్‌లోని తన ప్రతినిధులకు భారీ మొత్తంలో విదేశీ నిధులు పంపినట్లు అభియోగం.