వర్షాకాలంలో దొరికే అల్ బుకరా పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చేస్తాయి. ముఖ్యంగా మన శరీరంలో ఉండే విషతుల్యాలను బయటకు పంపించడంలో అల్ బుకరా సాయం చేస్తుంది. అల్ బుకారా తినడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది. బ్లడ్ షుగర్, ఎముకల వ్యాధి, గుండె జబ్బుల ప్రమాదాలను, ఆస్టియోపెనియా ప్రమాదాన్ని తగ్గిస్తాయి.